
కాబుల్: వరుస భూకంపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. రెండు రోజుల క్రితం సంభవించిన రెండు వరుస భూకంపాలు వెనిజువెలాను అతలాకుతలం చేశాయి. రెండు రోజులు గడిచిన ఆ దేశంలో ఇంకా సహయక చర్యలు కొనసాగుతున్నాయంటే భూకంప ప్రభావం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగానే.. తాజాగా ఆప్ఘానిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2 తీవ్రత నమోదైంది. భారత కాలమానం ప్రకారం శనివారం (జూన్ 27) రాత్రి 7:04 గంటల ప్రాంతంలో భూమికి 215 కిలో మీటర్ల లోతులో భూకంపం చోటుచేసుకుంది. ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌లోని కలాఫ్‌గాన్‌కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది.
ఈ భూకంప ప్రభావంతో పాకిస్తాన్, భారతదేశం, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తుర్క్‌మెనిస్తాన్‌లలో ప్రకంపనలు సంభవించాయి. భారత్ లోని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్లో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు.