
హైదరాబాద్, వెలుగు: ఐఐటీ, -జేఈఈ, నీట్ శిక్షణ ఇస్తున్న ‘రెసోనెన్స్ విద్యాసంస్థలు’ అదిలాబాద్‌లో కొత్త ఫౌండేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. దీనిని అదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అనూష సతీష్ భండారి ప్రారంభించారు. రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఒలింపియాడ్స్, జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో సిద్ధం చేయడానికి ఈ సెంటర్ దోహదపడుతుందని తెలిపారు.