
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఒక స్ట్రాంగ్ టీమ్‌గా ఉంది. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్స్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ 2023 ఫైనల్స్ ఆడి, టీ20 వరల్డ్ కప్ 2024, 2026, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీలు గెలిచి.. వరల్డ్ క్రికెట్‌లో డామినేషన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇదంతా నాణానికి ఒక వైపులా మాత్రమే ఉంది. ఎందుకంటే.. ఒకవైపు కప్పులు కొడుతూనే మరోవైపు చెత్త రికార్డులను కూడా మూటగట్టుకుంటుంది. తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ఓటమితో మరోసారి టీమిండియా చెత్త రికార్డులపై చర్చ మొదలైంది.
అయితే టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత చాలా దారుణాలు చోటు చేసుకున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2024 గెలుపు తర్వాత.. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియడంతో గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టారు. కానీ ఆరంభంలోనే గంభీర్‌కు గట్టి షాక్ తగిలింది. ఆయన కోచింగ్‌లో టీమిండియా తొలి సిరీస్‌లోనే ఓటమిపాలైంది. అదే కాకుండా గంభీర్ కోచింగ్‌లో అత్యంత చెత్త రికార్డులను టీమిండియా మూటగట్టకుంది. వాటిలో కొన్నింటి గురించి మాట్లాడుకుంటే..
2024 ఏడాదిలో టీమిండియా ఒక్క వన్డే మ్యాచ్ కూడా గెలవలేదు. ఆ ఏడాదిలో మొత్తం మూడు వన్డేలు మాత్రమే ఆడినప్పటికీ.. కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ టై అయింది. భారత క్రికెట్ చరిత్రలో ఇలా ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒక్క వన్డే కూడా గెలవకుండా కేవలం నాలుగు సార్లు మాత్రమే జరిగింది. 1974, 1979, 1989 తర్వాత మళ్లీ 2024లోనే జరిగింది. అంటే దాదాపు 49 ఏళ్ల తర్వాత ఆ చెత్త రికార్డ్ గంభీర్ కోచింగ్‌లోనే జరిగింది.
అలాగే 36 ఏళ్ల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌పై టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయింది. 25 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోయింది. 27 ఏళ్ల తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్‌లో ఓటమిపాలైంది. 10 ఏళ్ల తర్వాత భారత్ బోర్డర్-గవార్కర్ ట్రోఫీ కోల్పోయింది. 12 ఏళ్ల తర్వాత హోమ్ టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయింది. తాజాగా ఐర్లాండ్‌పై తొలిసారి ఓటమి చవిచూసింది. ఇలా టీమిండియా అభిమానులు కలలో కూడా ఊహించని ఓటములు గంభీర్ కోచింగ్‌లోనే వచ్చాయి. అయితే ఈ ఓటములు మాత్రమే కాదు.. గెలుపు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్‌లను టీమిండియా గంభీర్ కోచింగ్‌లోనే గెలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి