
నిజామాబాద్, వెలుగు: ల్యాండ్ రికార్డ్స్ మార్చిన నిజామాబాద్ నార్త్తహసీల్దార్ఆఫీస్ రికార్డ్ అసిస్టెంట్ జె.రాహుల్ సస్పెండ్అయ్యారు. ఆఫీస్లో ల్యాండ్ రికార్డులు మారుస్తున్నాడన్న ఆరోపణలపై విచారణ నిర్వహించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి.. అందిన రిపోర్టు మేరకు శనివారం చర్యలు తీసుకున్నారు.
నగరంలోని కంఠేశ్వర్ఏరియాలోని సర్వే నంబర్291/ఏ, 291 ఏఏ/ 292కు సంబంధించి పట్టాదారుకాలంలో రాహుల్బోగస్ పేరు చేర్చి పహాణీ రూపొందించాడు. రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు.