
ఎయిర్ పోర్టు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. 2026 జూన్ 25 నుంచి అధికారికంగా బాద్యతలు స్వీకరంచడంతో నాగ్‌పూర్ ఎయిర్ పోర్ట్ జీఎంఆర్ నిర్వహిస్తున్న విమానాశ్రయాల లిస్టులో చేరింది.
ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్, గోవా (మోపా), నాగ్‌పూర్, బీదర్, ఇండోనేషియాలోని మెడాన్ ఎయిర్ పోర్టులను జీఎంఆర్ నిర్వహిస్తోంది. వీటితోపాటు ఫిలిప్పీన్స్‌లోని మాక్టాన్-సెబూ ఎయిర్ పోర్టుకు టెక్నికల్ సపోర్టు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, గ్రీస్‌లోని క్రీట్ ప్రాంతాల్లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టులను కూడా అభివృద్ధి చేస్తోంది.
►ALSO READ | తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు..ఈగల్ ఫోర్స్‌కు ఫుల్ పవర్స్ : డిప్యూటీ సీఎం భట్టి
నాగ్‌పూర్‌ను మధ్య భారతదేశానికి ప్రధాన విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని జీఎంఆర్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశానికి మధ్యలో ఉండటం వల్ల నాగ్‌పూర్ దేశీయ, అంతర్జాతీయ విమానాల ట్రాన్స్‌ఫర్ హబ్‌గా ఎదిగే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్ నాయుడు అన్నారు. ఈ అభివృద్ధితో కార్గో రవాణా, లాజిస్టిక్స్, ఎంఆర్ఓ సేవలు, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.