
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ రాకా. పుష్ప 2 సంచలనం తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. కొన్ని నెలల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే నటిస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఇందులో మరో హీరోయిన్ కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనున్నారని టాక్ నడుస్తుంది. త్వరలోనే ముంబాయిలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ లో రష్మిక జాయిన్ కానున్నారట. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో..
ఇదిలా ఉంటే.. రాకా చిత్రంలో బన్నీతోపాటు మృణాల్ ఠాకూర్, జాన్నీ కపూర్ సైతం కీలకపాత్రలలో కనిపించనున్నారని టాక్. వీరితోపాటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సైతం ముఖ్య పాత్ర పోషిస్తున్నారట. అయితే ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఫిల్మ్ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. త్వరలనే అల్లు అర్జున్, అట్లీ, దీపిక ఓ ఈవెంట్ కు హాజరవుతారని.. అందులో షారుఖ్ ఈసినిమాకు సంబంధఇంచిన కీలక అప్డేట్ పంచుకుంటారని తెలుస్తోంది.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
ఈ చిత్రాన్ని దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ ఏడాది చివరకు షూటింగ్ మొత్తం పూర్తి చేయలని చిత్రయూనిట్ భావిస్తుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‌తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..
రష్మిక మందన్నా ఇన్ స్టా పోస్ట్..
ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..