Reading Time: < 1 minute

రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు పోస్తే.. లక్ష రూపాయలు ఫైన్: మల్కాజ్ గిరి కార్పొరేషన్

Caption of Image.

ప్రజారోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మల్కాజ్ గిరి కార్పొరేషన్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇష్టారాజ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై, ఖాళీ స్థలాల్లో పోస్తే కఠిన చర్యలు, భారీ జరిమానాలను విధిస్తున్నారు.  నిబంధనలు ఉల్లంగిస్తే లక్ష రూపాయల వరకు జరిమాని విధిస్తామని హెచ్చరించారు. నిర్మాణ వ్యర్థాలను గుర్తింపు పొందిన ప్రాసెసింగ్ ప్లాంట్లకు మాత్రమే తరలించాలని కోరింది.

భవన నిర్మాణం, కూల్చివేత వ్యర్థాలను తప్పనిసరిగా ప్రాసెసింగ్ యూనిట్లకే తరలించాలని బిల్డర్లకు మల్కాజ్ గిరి కార్పొరేషన్ అధికారులు ఆదేశించారు. రోడ్లు, ఖాళీ స్థలాలు,  నాలాలు, ఇతర ప్రదేశాల్లో నిర్మాణ వ్యర్థాలను పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  తెలిపారు. అధిక లోడ్, అక్రమం డంపింగ్ విషయంలో మొదటి సారి రూల్స్ అతిక్రమిస్తే రూ. 25 వేల జరిమానా రెండో సారి బ్రేక్ చేస్తే రూ. 50 వేలు మూడోసారి రూల్స్ ఉల్లంఘిస్తే  లక్ష రూపాయలు జరిమానాతోపాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. 

ఇక నిర్మాన వ్యర్థాలను గుర్తింపు పొందిన  ప్రాసెసింగ్ యూనిట్లకే తరలించాలని  నిబంధనలు పెట్టారు. నిర్మాణ వ్యర్థాల సేకరణ,రవాణా ఛార్జీ టన్నుకు రూ. 426 , స్వంత వాహనాల్లో తరలిస్తే ట న్నుకు రూ. 106 లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రజారోగ్యం, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మల్కా్జ్ గిరికమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి విజ్ణప్తిచేశారు. 

©️ VIL Media Pvt Ltd.