Reading Time: 2 minutes

God of War: కుమారస్వామిగా ఎన్టీఆర్? ‘గాడ్ ఆఫ్ వార్’పై నాగవంశీ బిగ్ అప్డేట్!

Caption of Image.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ చిత్రం తర్వాత నిర్మాత నాగవంశీ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనుంది. మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి ప్రస్తుతం ‘God of War’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటివరకు మూవీపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే, చాలా సార్లు నాగవంశీ హింట్స్ ఇస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫైనల్లీ వచ్చేస్తోంది అని పోస్ట్ పెట్టి తారక్ ఫ్యాన్స్కు బిగ్ అప్డేట్ ఇచ్చారు.

నిర్మాత నాగవంశీ X వేదికగా  “మోస్ట్ అవైటెడ్ డే వచ్చేసింది.. ఇవాళ సాయంత్రం 5:04 నిమిషాలకు బిగ్ అప్డేట్” అంటూ క్రిప్టిక్ పోస్ట్ చేశారు. పోస్ట్‌లో నెమలి ఎమోజీ ఉపయోగించడం ఆసక్తిని పెంచింది. మరి ముఖ్యంగా  నెమలి ఎమోజీ పెట్టడంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌కు సంకేతమని అభిమానులు భావిస్తున్నారు.

అలాగే, ఈ పోస్ట్‌పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా నెమలి ఎమోజీతో స్పందిస్తూ కొత్త ప్రారంభానికి మొదలు అంటూ సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజా పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో ఎన్నాళ్లుగానో వార్తల్లో ఉన్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ గురించేనని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇక క్లారిటీ రావాలంటే సాయంత్రం వరకు వేయికళ్లతో ఎదురుచూడాల్సిందే!

కుమారస్వామిగా ఎన్టీఆర్?  

నాగవంశీ చాలా సందర్భాల్లో హింట్స్ ఇస్తూ వచ్చారు. గతేడాది కూడా ‘అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకడిగా నా ఫేవరెట్‌‌‌‌‌‌‌‌ బ్రదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అంటూ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓ శ్లోకాన్ని షేర్ చేశారు. పురాణాల్లో హిందూ యుద్ధ దేవుడుగా కీర్తించే సుబ్రహ్మణ్యస్వామి ఇతివృత్తంతో ఈ మైథలాజికల్ మూవీ తెరకెక్కబోతోందని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. ఇపుడు తాజాగా నెమలి వాహనంస్వామి కుమారస్వామికు ప్రతీకగా భావించే నెమలి ఎమోజీని పెట్టడం విశేషంగా మారింది. ఈ చిత్రం స్వామి కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్యస్వామి ఆధారంగా రూపొందుతున్న మైథలాజికల్ డ్రామానేనని అంచనా వేస్తున్నారు.

గత ఏడాది ముంబై విమానాశ్రయంలో ఎన్టీఆర్ చేతిలో Muruga – The Lord of War, The God of Wisdom పుస్తకం కనిపించడం మరిన్ని ఊహాగానాలకు దారితీసింది. దీంతో ఈ సినిమా కోసం ఆయన అప్పుడే సిద్ధమవుతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ ప్రాజెక్ట్లో కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్యస్వామి పాత్రలో ఎన్టీఆర్ కనిపించే అవకాశం ఉందన్న వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.