
Kavya Maran Anirudh Wedding: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కావ్య, అనిరుధ్ పెళ్లి ఫిక్స్ అయినట్లు కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి. కానీ వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అనిరుధ్ బంధువు, సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
అనిరుధ్ మంచి వ్యక్తి.. నాకు తెలిసినంత వరకు వాళ్లిద్దరూ మ్యారేజ్ చేసుకోబోతున్నారు.. ఆ అమ్మాయి నార్మల్ వ్యక్తి కాదు.. అంత పెద్ద టీమ్(SRH)ను నిర్వహించగల సామర్థ్యం కావ్యకు ఉంది. తండ్రి వ్యాపార నైపుణ్యాలు ఆమె అందిపుచ్చుకుంది.. ఆ ఇద్దరూ మంచి జోడీ.. కలిసి మ్యూజిక్ బిజినెస్‌లో కూడా రాణిస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. మహేంద్రన్ చేసిన ఈ కామెంట్స్ తో కావ్య-అనిరుధ్ పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. కానీ గతంలో ఈ వార్తలను అనిరుధ్ ఖండించిన విషయం తెలిసిందే.
వై దిస్ కొలవెరి డీ సాంగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్.. అనంతరం తమిళ, హిందీ సినిమాల్లో అనేక హిట్ పాటలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జైలర్, జెర్సీ, జవాన్, లియో లాంటి పలు చిత్రాలకు ఆయన అందించిన సంగీతం చాలా మంచి ఆదరణ పొందింది. కావ్య.. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె.. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో గ్రౌండ్ లో తనదైన స్టైల్ లో హావభావాలతో పాపులర్ అయింది. కళానిధి మారన్ నిర్మించిన జైలర్, బీస్ట్, రాయన్ వంటి సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు.