
ఐకాన్ట్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకా’ ( Raaka ) . సుమారు రూ. 700 కోట్లకు పైగా బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి కీలక అప్టేడ్ ఒకటి బయటకు వచ్చింది. ‘పుష్ప’లో పుష్పరాజ్ శ్రీవల్లిగా అలరించిన నేషనల్ క్రష్ రష్మిక.. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ తో ‘రాకా’ కోసం చేతులు కలపబోతుంది. అయితే ఈ సారి వీరు సరికొత్త క్యారక్టర్ తో రచ్చ చేయబోతుంది.
ముంబై షెడ్యూల్‌లో రష్మిక..
ఈ ప్రతిష్టాత్మక సినిమాలో రష్మిక ఒక పవర్ ఫుల్ అండ్ పివోటల్ రోల్ ప్లే చేయబోతోంది. త్వరలోనే ముంబైలో ప్రారంభం కానున్న భారీ యాక్షన్ షెడ్యూల్‌లో రష్మిక జాయిన్ కానుంది. అయితే ఈ మూవీలో కేవలం రష్మిక మాత్రమే కాదు, బాలీవుడ్ బ్యూటీలు, దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రల్లో మెరవనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ హీరోయిన్లతో అట్లీ ఎలాంటి స్క్రీన్ ప్లే ప్లాన్ చేశాడో అని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.
కింగ్ ఖాన్ ఎంట్రీ..!
ఈ ప్రాజెక్ట్‌ను కేవలం పాన్-ఇండియా కాదు.. గ్లోబల్ లెవెల్‌లో ప్రెజెంట్ చేయడానికి అట్లీ గట్టి స్కెచ్ వేశారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్అతిథి పాత్ర చేయబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు, త్వరలోనే జరగబోయే ఒక వర్చువల్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్ చేతుల మీదుగా, అట్లీ, అల్లు అర్జున్, దీపికా పదుకొణె సమక్షంలో ‘రాకా’ టీజర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ మెగా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
డిసెంబర్ 2027న విధ్వంసమే!
భారీ బడ్జెట్ లో తెరకెక్కతున్న ఈ విజువల్ వండర్ 2026 చివరి నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ లో బన్నీ కళ్ళు, కోరలతో ఉన్నారు. ఇదొక మైథలాజికల్ లేదా హై-ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని అర్థమవుతోంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ.. ఈ సినిమాను డిసెంబర్ 2027లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ ‘రాకా సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదనేది మాత్రం ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.