Reading Time: < 1 minute

109 అంతస్తుల బిల్డింగ్పై విమానం క్రాష్ .. అంత ఎత్తు నుంచి ఎలా పడిపోయిందో చూడండి !

Caption of Image.

109 అంతస్తుల బిల్డింగ్.. ఎంత ఎత్తు ఉంటుందో ఊహించుకోగలరా. కింద నిలబడి టాప్ ఫ్లోర్ ను చూడగలమా.. పది అంతస్తుల భవంతులే ఆకాశ హర్మ్యాల్లా కనిపిస్తాయి. అలాంటి 109 అంతస్తులంటే.. అంత ఎత్తైన బిల్డింగ్ పై విమానం క్రాష్ అయిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అంత ఎత్తునుంచి విమానం పడిపోతుంటే అదేదో కాగితం విమానంలా అనిపించడం వీడియోలో చూడవచ్చు.

ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నగరాల్లో ఒకటైన చైనా రాజధాని బీజింగ్ లో..  శుక్రవారం  (జూన్ 26) మధ్యాహ్నం ఒక చిన్న విమానం అత్యంత ఎత్తైన భవనాన్ని ఢీకొట్టింది. చైనా జున్ పిలిచే 109 అంతస్తుల సిటిక్ టవర్ నుంచి విరిగిన రెక్కల ముక్కలు కింద పడుతుంటే కాగతం ముక్కల్లా కనిపించినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలలో, విమానం తోక భాగం నేలపై పడి ఉండటం చూడవచ్చు. అలాగేపగిలిపోయిన కిటికీ లో  ఒక టాక్సీ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. 

ప్రమాదం జరిగిన వెంటనే.. ఆ టవర్ లో పనిచేస్తున్న ఉద్యోగులు భయాందోళనతో ఒకచోటకు చేరి.. పడిపోతున్న శకలాలను వీడియో తీశారు. విషయం తెలుసుకుని ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది, అలాగే అంబులెన్స్ లు అక్కడిక చేరుకున్నాయి.  ప్రమాదానికి గురైన విమానం.. స్థానిక జనరల్ ఏవియేషన్ కంపెనీకి చెందిన సన్‌వార్డ్ SA 60L అరోరా లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అని గుర్తించారు.

అతిపెద్ద భవంతి పక్క నుంచి వెళ్తున్న సమయంలో ఒక అంచును విమానం ఢీకొట్టినట్లు తెలుస్తోంది.  డ్రోన్ కార్యకలాపాలపై బీజింగ్ తీవ్ర ఆంక్షలను పెట్టిన కొన్ని వారాల తర్వాత ఈ సంఘటన జరిగటం గమనార్హం.  మే 1 నుంచి బీజింగ్ లో ప్రభుత్వ అనుమతి లేనిదే డ్రోన్స్, చిన్న విమానాలు ఎగురవేయడం నిషేధమని ప్రభుత్వం ప్రకటించింది. 

突发,6月26日傍晚,北京中信大厦(中国尊)被一架小型飞机撞击,原因不明。 pic.twitter.com/Y2DyUHNxnl

— 李老师不是你老师 (@whyyoutouzhele) June 26, 2026

©️ VIL Media Pvt Ltd.