
తెలంగాణ ప్రజలు, రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రమంతటా వర్షాలు కురిస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రబీ సీజన్ మొదలైనప్పటికీ వానలు పడక.. ఆకాశంవైపు చూస్తున్న రైతన్నలకు ఇది ఒక శుభవార్త.
ఇవాళ(జూన్ 27) రాష్ట్రంలోని 22 జిలాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్,మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ ఈదురు గాలులలో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.