Reading Time: < 1 minute

హైదరాబాద్‎లో వైభవంగా ‘మువ్వల సవ్వడి–2026’

Caption of Image.

పద్మారావునగర్, వెలుగు: నగరంలోని సెస్ ఆడిటోరియంలో ‘అమృత కల్చరల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో వార్షిక హైదరాబాద్ నృత్యోత్సవం ‘మువ్వల సవ్వడి–2026’ ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. రోజంతా రెండు విభాగాలుగా సాగిన ఈ ఉత్సవంలో కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్ వంటి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. 

ఉదయం వినాయక జనన శబ్దం, జతిస్వరం, ఒడిస్సీ నృత్యాలు అలరించగా, సాయంత్రం ‘ద్రౌపది వస్త్రాపహరణం’, ‘కాళింగ నర్తన తిల్లాన’ నృత్య రూపకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆరు విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులు అందజేసి, సీనియర్ గురువులతో పాటు యువ కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్​ ఐఎఫ్‌‌ఎస్ అధికారి టి.వి.ఎన్. రావు, ప్రముఖ ఆంధ్రనాట్య శ్రేష్ఠులు ఆచార్య కళాకృష్ణ, భరతనాట్య విదుషీమణి డాక్టర్​  రాజేశ్వరి సాయినాథ్​ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.