Reading Time: 2 minutes

యూరప్‌లో ఎండల సెగ.. ఫ్యాన్లతో సర్దుకుపోయే జనం ఇప్పుడు ఏసీల కోసం క్యూ కడుతున్నారు ?

Caption of Image.

అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో ఎండా కాలం వచ్చిందంటే చాలు.. అందరూ ఎయిర్ కండీషనర్ల (AC) కింద కూర్చుండిపోతారు. కానీ యూరప్‌లో మాత్రం పరిస్థితి వేరు. అక్కడ ఎండలు ఎక్కువైతే కిటికీలు మూసేసి, ఫ్యాన్ వేసుకుని, చల్లటి నీళ్లు తాగుతూ సర్దుకుపోతుంటారు.

అమెరికాకు యూరప్‌కు తేడా ఏంటి?

అమెరికాలో దాదాపు 90% ఇళ్లలో ఏసీలు ఉన్నాయి. కానీ యూరప్‌లో కేవలం 20% ఇళ్లలో మాత్రమే ఏసీలు ఉన్నాయి. స్పెయిన్ వంటి వేడి ఎక్కువగా ఉండే దేశాల్లో సగం ఇళ్లలో ఏసీలు ఉంటే, జర్మనీలో మాత్రం కేవలం 6% ఇళ్లలోనే ఏసీలు ఉన్నాయి. ఎందుకంటే, ఒకప్పుడు యూరప్ దేశాల్లో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో ఏసీ అనేది ఒక అవసరంగా ఎవరూ భావించలేదు.

ఇప్పుడు ఎందుకు మారుతోంది 
యూరప్‌లో ఎప్పుడూ ఎండలు ఉంటాయి, కానీ ఇప్పుడు  తీవ్రమైన వడగాల్పులు  విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవి ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి.

గత 20వ శతాబ్దంతో పోలిస్తే, జూన్ 2026 నాటికి యూరప్‌లో ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి.దీనివల్ల చల్లదనం కోసం కరెంట్ వాడకం బాగా పెరిగిపోయింది. జర్మనీలో 2019 నుండి 2024 మధ్య ఏసీల డిమాండ్ ఏకంగా 75% పెరిగింది.

జర్మనీ వంటి దేశాల్లో ఇళ్లను చలికాలంలో వేడిని లోపలే ఉంచేలా కడతారు. కానీ అవి ఎండాకాలంలో చల్లగా ఉండటానికి సెట్ అవ్వవు. అక్కడ చాలా మంది అద్దె ఇళ్లల్లో ఉంటారు. ఓనర్లు ఏసీలు పెట్టడానికి ఒప్పుకోరు, అలాగే అద్దెకు ఉండేవాళ్లు కూడా సొంత డబ్బులు పెట్టి ఏసీలు కొనడానికి ఇష్టపడరు.

 పాత కాలపు బిల్డింగుల్లో ఏసీలు అమర్చడం కష్టం, పైగా అక్కడి ప్రభుత్వాల చట్టాలు, రూల్స్ అడ్డువస్తాయి. కరెంట్ బిల్లులు పెరిగిపోవడం వల్ల 38% మంది వాళ్ళ  ఇళ్లను చల్లగా ఉంచుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది.

పర్యావరణానికి ముప్పు
ఏసీలు ఎక్కువగా వాడటం వల్ల గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) మరింత ఎక్కువవుతుంది. 2024లో తాపన (Heating) కోసం వాడిన కరెంట్ తగ్గినా, చల్లదనం (Cooling) కోసం వాడిన కరెంట్ 15.3% పెరిగింది. ఏసీల నుంచి వచ్చే వేడి వల్ల బయట వాతావరణం ఇంకా వేడెక్కుతుంది. ఇదొక పెద్ద సమస్యగా మారింది.

ఏసీలకు ప్రత్యామ్నాయాలు ఏంటి?

పర్యావరణానికి హాని చేయని కొన్ని పద్ధతులను ఇప్పుడు వాడుతున్నారు:

*కొత్త రకం బిల్డింగులు: గాలి బాగా ఆడేలా, ఎండ వేడిని లాగని పదార్థాలతో ఇళ్లను కట్టడం.
*హీట్ పంప్స్ : ఇవి ఇళ్లను చలికాలంలో వేడిగా, ఎండాకాలంలో చల్లగా ఉంచుతాయి. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది.
*చెట్లు ఇంకా నీటి వనరులు: సిటీ  నగరాల్లో చెట్లను పెంచడం, వాటర్ మిస్టింగ్ సిస్టమ్స్ (నీటి తుంపరలు చల్లే వ్యవస్థలు) ఏర్పాటు చేయడం.
*డిస్ట్రిక్ట్ కూలింగ్: పారిస్, స్టాక్‌హోమ్ వంటి నగరాల్లో భూగర్భ పైపుల ద్వారా చల్లటి నీటిని పంపి, ఒకేసారి చాలా బిల్డింగులను చల్లబరుస్తున్నారు.

స్మార్ట్ ఏసీలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉన్న కొత్త ఏసీలు కరెంట్ వాడకాన్ని 40% వరకు తగ్గిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.