తమ యూజర్స్ కోసం మెటా సంస్థ ఇన్‌స్టా, థ్రెడ్స్‌లో సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. యూజర్స్ తమ ఫీడ్లను తమ కంట్రోల్లో ఉంచుకునేందుకు సహాయపడేలా మెటా తన ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ యాప్‌లలో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను డిజైన్ చేసింది. ఈ కొత్త ఫీచర్స్ ద్వారా మీరు ఇన్‌స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు నచ్చిన కంటెంట్ మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తుంది.
థ్రెడ్స్‌లో యువర్ అల్గో: ఈ ఫీచర్ ద్వారా థ్రెడ్స్ యాప్‌లో మీకు ఎలాంటి విషయాలు ఎక్కువగా కావాలి లేదా వద్దు అనేదాన్ని మీరు ప్రైవేట్‌గా సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీకు ఎక్కువగా స్పోర్ట్స్ కు సంబంధించిన పోస్ట్‌లు రావాలని అనుకుంటే, మానసిక ఒత్తిడిని కలిగించే పోస్ట్‌లు తగ్గాలని అనుకుంటే మీరు ఈ కొత్త ఆప్షన్ ద్వారా ఎంచుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ఒక రోజు నుండి ఒక వారం వరకు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో యువర్ అల్గోరిథం: ఇన్స్టాగ్రామ్ అసలు ఏ బేసిస్ మీద మీకు పోస్ట్‌లను రికమండ్ చేస్తోంది అనేది ఈ ఫీచర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ లేని టాపిక్స్‌ను మీరే స్వయంగా మార్చుకోవచ్చు. ఈ మార్పులు ఫీడ్, ఎక్స్ప్లోర్, రీల్స్.. ఈ మూడింటికీ వర్తిస్తాయి.
గతానికి, ఇప్పటికీ తేడా ఏంటి?: ఇంతకుముందు సోషల్ మీడియా యాప్‌లు మీరు లైక్ చేసిన లేదా చూసిన పాత డేటాను బట్టి మీకు కంటెంట్‌ను రికమండ్ చేసేవి. కానీ ఇకపై అలా ఉండదు. వినియోగదారులే తమకు ఎలాంటి కంటెంట్ కావాలో వారే డిసైడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తి వారికి స్వేచ్ఛను ఇవ్వడమే అనే ఉద్దేశంతో తీసుకొచ్చినట్టు మెటా పేర్కొంది.
ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ AI టెక్నాలజీ వల్ల అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయనేది వినియోగదారులకు సులభంగా అర్థమవుతుందని.. గందరగోళం తొలగిపోతుందని అన్నారు. మొత్తానికి, ఇకపై మీ సోషల్ మీడియా ఫీడ్‌లో ఏం రావాలో మీరే డిసైడ్ చేయవచ్చు. అనవసర కంటెంట్‌కు దూరంగా ఉండవచ్చు.




