Reading Time: < 1 minute

యూపీలో గొడ్డు మాంసం కలకలం: ఇంట్లో బీఫ్ వండుతున్నారని ముగ్గురు మహిళల అరెస్ట్!

Caption of Image.

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ ఇంట్లో గొడ్డు మాంసం (బీఫ్) వండుతున్నారనే ఆరోపణలపై పోలీసులు ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి వండిన, పచ్చి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు శనివారం వెల్లడించారు.

 పోలీసుల కథనం ప్రకారం.. పనారా గోపాల్‌పూర్ గ్రామంలోని ఒక ఇంట్లో నిషేధిత పశు మాంసం (బీఫ్) వండుతున్నారని పోలీసులకు  సమాచారం అందింది. దింతో పోలీసులు అకస్మాత్తుగా ఆ ఇంటిపై దాడి చేశారు.

“పోలీసులు రావడం చూసి ఆ ఇంట్లో ఉన్న నలుగురు పురుషులు గ్రామంలోని ఇరుకైన సందుల్లోంచి తప్పించుకుని పారిపోయారు” అని    ఓ పోలీస్ అధికారి  తెలిపారు.

ఇంట్లో దొరికిన మాంసం.. మహిళల అరెస్ట్
పోలీసులు లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ ముగ్గురు మహిళలు ఉన్నారు. వారి వద్ద వండిన మాంసం ఉన్న ఒక గిన్నె, పచ్చి మాంసం ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించాయి. పోలీసులను చూసి ఆ మహిళలు కూడా పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ అక్కడే ఉన్న మహిళా పోలీసులు వారిని పట్టుకున్నారు.

పోలీసుల విచారణలో ఆ మహిళలు నిజం ఒప్పుకోగా… వారి కుటుంబంలోని పురుషులు ఆ గొడ్డు మాంసాన్ని ఇంటికి తెచ్చారని చెప్పారు. అందులో సగం మాంసాన్ని ఆ రోజే తినడానికి వండుతున్నామని, మిగిలిన సగాన్ని తరువాత రోజు కోసం దాచామని వారు పోలీసులకు తెలిపారు.

కేసు నమోదు.. కోర్టులో హాజరు
అరెస్ట్ అయిన మహిళలంతా అదే గ్రామానికి చెందినవారు. వారి దగ్గరి నుండి కిలో పచ్చి మాంసం, మరో కిలో వండిన మాంసాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై సరాయ్ అకిల్పో లీస్ స్టేషన్‌లో ‘ఉత్తర ప్రదేశ్ గోవధ నివారణ చట్టం’ కింద కేసు నమోదు చేశారు. నిందితులైన ఆ ముగ్గురు మహిళలను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. పారిపోయిన పురుషుల కోసం గాలిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.