Reading Time: < 1 minute
Weather Report: తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. జూన్ 26 నాటికి, నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 20°N/60°E, 20°N/65°E, 20°N/70°E, సూరత్, ఇండోర్, మాండ్లా, డాల్టన్‌గంజ్, మోతీహరి మరియు 28.3°N/83°E మీదుగా కొనసాగుతోందని.. రాబోయే 3-4 రోజులలో ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.

మరోవైపు ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం, ఉత్తర తెలంగాణ, పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 5.8 కి.మీ ఎత్తు మధ్య కేంద్రీకృతమై ఉంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశగా వాలి ఉందని.. అలాగే ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలలోని ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు-మధ్య అరేబియా సముద్రం వరకు ఉన్న ద్రోణి, కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించి ఉందని.. ఇది తెలంగాణ మరాఠ్వాడా పరిసర ప్రాంతాల మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం గుండా సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 4.5 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోందని తెలిపింది.

దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శని, ఆది వారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని… కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ వేగంతోనూ, మిగిలిన ప్రాంతాలు లో ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.