Reading Time: < 1 minute

పశ్చిమ ఐరోపాలో ఎండల తీవ్రత.. ఫ్రాన్స్ లో వెయ్యికిపైగా మరణాలు 

Caption of Image.

పశ్చిమ ఐరోపాలో  ఎండల తీవ్రతకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వేడిగాలులతోగతంలో ఎన్నడూలేని విధంగా చనిపోతున్నారు. గడిచిన కొద్ది రోజుల్లో ఫ్రాన్స్ లో వెయ్యిమందికి పైగా చనిపోయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇండ్లలో ఉన్న మనుషులు కూడా చనిపోతున్నారంటే వేడి గాలుల తీవ్రత ఎంత ఉందో  అర్థం చేసుకోవచ్చు. ఇలాగే కొనసాగితే ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశంఉందంటున్నారు.

పశ్చిమ ఐరోపాలో ఒమెగా బ్లాక్  అనే వాతావరణం ప్రభావం కారణంగా తీవ్రస్థాయిలో  ఎండలు, వడగాలులు వీస్తున్నాయి.  ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ దేశాలలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, వేడిమి తట్టుకోలేక ఈతకు వెళ్లి మునిగిపోవడం, వడదెబ్బ తగలడం వల్ల భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతోంది.

►ALSO READ | ప్రధానికి అరుదైన గౌరవం.. సీషెల్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ

జూన్ 24 నుంచి నమోదైన ప్రాథమిక గణాంకాల ప్రకారం.. ఈ మరణాల్లో 85 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. పారిస్‌తో పాటు ఇలే-డి-ఫ్రాన్స్ ప్రాంతంలో చాలామంది తమ ఇళ్లలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒంటరిగా నివసించే వృద్ధులు, సహాయం అందనివారు ఎక్కువగా ఈ వడగాల్పులకు(వేడిగాలులకు) బలైనట్లు అధికారులు పేర్కొన్నారు. 

అయితే ఇవి ప్రాథమిక గణాంకాలు మాత్రమేనని, తుది లెక్కల్లో మార్పులు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆదివారం నుంచి ఫ్రాన్స్‌లో వేడి కొంత తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు.
 

©️ VIL Media Pvt Ltd.