
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు: ఫేస్బుక్, స్నాప్‌షాట్, ఇన్స్టాగ్రాం ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో మోసం చేసి హోటళ్లకు రప్పించి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఓ యువకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.
గచ్చిబౌలి డీఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన కిలారి నాగతేజ అలియాస్ నాని(24) స్నాప్‌చాట్ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 22న గచ్చిబౌలిలోని ఓ హోటల్‌కు పిలిచాడు.
హోటల్ గదిలో ఆమెను కత్తితో బెదిరించి, బలవంతంగా నగ్న ఫొటోలు, వీడియోలు తన ఫోన్‌లో రికార్డు చేశాడు. వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరించి ఆమె నుంచి రూ.1.10 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.
బాధితురాలు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు నాగతేజను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నాగతేజ ఇదే తరహాలో మరికొంతమంది యువతులను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.