Reading Time: < 1 minute

బంకర్‌‌‌‌ బస్టర్స్‌‌‌‌ కు టి9 చాలెంజ్‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌ టైటిల్‌‌‌‌..

Caption of Image.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌‌‌‌లో జరిగిన టి గోల్ఫ్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక టోర్నీ ‘టి9 చాలెంజ్‌‌‌‌ సీజన్ 4’ టైటిల్‌‌‌‌ను డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌ ‘బంకర్ బస్టర్స్’ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌‌‌‌లో బంకర్ బస్టర్స్ జట్టు 4½–3½ పాయింట్ల తేడాతో ‘దాసోస్ బై మాహి’ జట్టుపై విజయం సాధించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. ఉదయం జరిగిన మొదటి సెషన్‌‌‌‌లో బంకర్ బస్టర్స్ జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించి 4–-0తో ఆధిక్యంలో నిలిచింది. 

సింగిల్స్‌‌‌‌లో నిర్వైర్ నాయర్, ఎస్ మురళీ విజయం సాధించగా.. డబుల్స్‌‌‌‌లో సాము మేనేజర్‌‌‌‌–-శైలేంద్ర థప్లియాల్.. రాఖీ సిన్హా-, ప్రతాప్ సింగ్ రణావత్ జోడీలు ఈజీగా గెలిచాయి. రెండో సెషన్‌‌‌‌లో దాసోస్ బై మాహి జట్టు  గట్టి పోటీ ఇచ్చింది. 

శ్రేయ్ రెడ్డి, ప్రసాద్ రావు సింగిల్స్‌‌‌‌లో గెలవగా.. నేత్ర రెడ్డి–-విజయ్ కుమార్ రెడ్డి జోడి డబుల్స్‌‌‌‌లో విజయం సాధించింది. చివరి మ్యాచ్ డ్రాగా ముగియడంతో దాసోస్ బై మాహి జట్టు కేవలం ఒక్క పాయింట్ తేడాతో టైటిల్‌‌‌‌ను కోల్పోయింది. 

©️ VIL Media Pvt Ltd.