
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై రగులుతున్న ఆందోళనలు ఇంకా చల్లారనే లేదు. అప్పుడే మరో పేపర్ లీక్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకవైపు నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్రతరం అవుతున్న తరుణంలో.. మహారాష్ట్రలో పేపర్ లీక్ కారణంగా టెట్ 2026 పరీక్ష వాయిదా పడటం తీవ్ర ఆగ్రహావేలకు దారి తీస్తోంది. దీంతో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
2026, జూన్ 28 (ఆదివారం) మహారాష్ట్రలో టెట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావటం, ఆందోళనలు మొదలవటంతో పరీక్ష వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ ఎగ్జామినేషన్ కౌన్సిల్ ప్రకటించింది.
ఈ పరీక్ష కోసం వెయ్యి 28 సెంటర్రలను ఏర్పాటు చేశారు. ఒకరోజు ముందు పరీక్ష జరగాల్సి ఉండగా.. పేపర్ లీకైనట్లు అధికారిక వర్గాల సమాచారం మేరకు పరీక్షను వాయిదా వేసినట్లు కౌన్సిల్ పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రైడ్ చేసిన బివండీ పోలీసులు.. TET 2026 పరీక్ష పేపర్లకు సంబంధించిన సీల్డ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పరీక్షకు 24 గంటల ముందే టెట్ పేపర్లు థానే ఏరియాలో సర్కిలేట్ అయినట్లు ప్రచారం జరిగింది. దీంతో కౌన్సిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రైడ్స్ నిర్వహించి సీల్డ్ పేపర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
మొత్తం 4.28 లక్షల మంది హాజరవుతున్న టెట్ పరీక్ష వాయిదా పడటంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతుననారు. పరీక్షకు సంబంధించి రీషెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు.
పేపర్ లీకేజ్ పై కాక్రోచ్ పార్టీ మద్ధతు దారులు విమర్శలకు దిగారు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని.. అదే సమయంలో మహారాష్ట్ర కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ హయాంలో పేపర్ లీక్ కావడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.