Reading Time: < 1 minute

జనగామ జిల్లాలో సంచలనం!.. ఒకే కేసులో సీఐ, ఎస్ఐని సస్పెండ్ చేసిన వరంగల్ సీపీ

Caption of Image.

జనగామ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే వెనకేసుకొచ్చేది లేదంటూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఒకే కేసులో ఏకంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేయడం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. అబ్బయ్యతో పాటు, గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా పనిచేసి, ప్రస్తుతం ఏఆర్ (AR) అటాచ్‌మెంట్‌లో ఉన్న ఎస్ఐ షేక్ హమీద్‌లపై సీపీ సన్‌ప్రీత్ సింగ్ సస్పెన్షన్ వేటు వేశారు. ఒకే వివాదంలో వీరిద్దరిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపారు.

ఈ విచారణలో వీరిద్దరిపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. శాఖాపరమైన క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో… ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు వరంగల్ సీపీ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, బాధ్యతారహితంగా ప్రవర్తించే అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు.

©️ VIL Media Pvt Ltd.