Reading Time: 2 minutes

భయ్యా నేను 13 సిక్సులు కొడుతా.. ఆ తర్వాత మీరు చూస్కోండి: వైభవ్ సూర్యవంశీ

Caption of Image.

Vaibhav Sooryavanshi: భారత జట్టుకి ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్ చేతిలో ఇండియన్ టీమ్ 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్ ఆర్డర్‌తో సహా బ్యాటర్లందరూ పెవిలియన్ కి క్యూ కట్టారు. అభిషేక్ శర్మ (50) ఒక్కడే రాణించగా.. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం ఘోరంగా విఫలమయ్యాడు. కాగా ఐర్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అరంగేట్రం చేస్తాడనే ప్రచారం జరిగింది. కానీ, అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చిన టీమ్ యాజమాన్యం వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. 

వైభవ్ ను ఆడించాల్సింది: 

ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడంతో వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకుని ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని ఆడిస్తే ఫలితం వేరేలా ఉండేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర మాట్లాడుతూ.. ఐర్లాండ్ తో మ్యాచ్లో వైభవ్ ని ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ 2026లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.

నేను 13 సిక్సులు కొడుతాను: 

అదో ఇంట్రెస్టింగ్ మ్యాచ్.. మేము మొదటగా ఫీల్డింగ్ చేశాం.. డిఫెన్స్‌కి 220 పరుగుల లక్ష్యం చేజ్ చేయాల్సి ఉంది.. అప్పుడు వైభవ్ నా దగ్గరకు వచ్చి.. ఈరోజు నేను 13 సిక్సర్లు కొడతాను.. నేను నా పని పూర్తి చేసిన తర్వాత మీరు మిగతాది చూసుకోండి అన్నాడు.. దీంతో డ్రెస్సింగ్‌రూమ్‌లో డోనోవాన్ ఫెరీరా, లువాన్ డ్రి ప్రిటోరియస్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.. అతడు అన్నట్లుగానే ఏకంగా 10 సిక్సర్లు కొడుతుంటే డగౌట్ లో ఉన్న డోనోవాన్, ప్రిటోరియస్ కింద కూర్చుని మరీ.. సిక్సర్లు లెక్కించడం స్టార్ట్ చేశారని సంగక్కర వెల్లడించాడు. 

15 ఏళ్లకే ఆరెంజ్ క్యాప్: 

కాగా ఐపీఎల్-2026లో భాగంగా మే 19వ తేదీన జైపూర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఇన్నింగ్స్ బ్రేక్ సందర్భంగా.. ఈ ఘటన జరిగినట్లు సంగక్కర చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. రాజస్థాన్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.
 

©️ VIL Media Pvt Ltd.