
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ మెగా టోర్నమెంట్లో 48 జట్లు బరిలోకి దిగగా, ఉత్కంఠభరితమైన లీగ్ స్టేజ్ ఇప్పటికే ముగిసింది. ఇందులో రౌండ్-32 (నాకౌట్ స్టేజ్)కు 32 జట్లు అర్హత సాధించాయి. ఇక్కడ్నుంచి మ్యాచ్ గెలిచిన వారే ముందకు వెళ్తారు. ఓడిన జట్లు నేరుగా ఇంటికి వెళ్లిపోవాల్సిందే. ముఖం పడతాయి. ఈ క్రమంలో ఆఫ్రికా ఖండపు దేశాలు ఫిఫా ప్రపంచ కప్‌లో ముందెన్నడూ లేని విధంగా సరికొత్త చరిత్రను లిఖించాయి.
నాకౌట్‌కు చేరిన 9 ఆఫ్రికా దేశాల జట్లు:
ఫిఫా చరిత్రలోనే తొలిసారిగా నాకౌట్ చేరిన 32 జట్లలో ఏకంగా తొమ్మిది ఆఫ్రికా దేశాలు ఉండటం గమనార్హం. గతంలో (2014, 2022 ప్రపంచ కప్‌లలో) ఒకే వరల్డ్ కప్‌లో ఆఫ్రికాకు చెందిన గరిష్టంగా రెండు టీమ్లు మాత్రమే నాకౌట్‌కు చేరేవి.. కానీ ఈసారి ఏకంగా 10 టీములకు గానూ 9 జట్లు నాకౌట్‌కు దూసుకెళ్లాయి. ఈ 9 జట్లలో ఆఫ్రికాలోనే అతిచిన్న దేశమైన కేప్ వెర్డే కూడా ఉండటం విశేషం. మిగతా అర్హత సాధించిన జట్లలో మొరాకో, దక్షిణాఫ్రికా, సెనెగల్, ఐవరీ కోస్ట్, ఘనా, ఈజిప్ట్, డీఆర్ కాంగో, అల్జీరియా ఉన్నాయి. కాగా ఇంతకు ముందు జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో ఆఫ్రికా ఖండం నుంచి సెమీస్ చేరిన ఏకైక జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. మరి ఈసారి ఈ 9 జట్లలో ఎన్ని టీమ్‌లు ముందడుగు వేస్తాయో అనేది వేచి చూడాలి.
►ALSO READ | భారత్ విన్నింగ్ కాంబినేషన్ మార్చొద్దు.. ఎలీస్ పెర్రీకి శ్రీ చరణి చెక్
నాకౌట్ రూల్స్.. డ్రాకి నో ఛాన్స్:
సోమవారం (జూన్ 29) నుంచి ఈ రౌండ్ 32 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఇక్కడి నుంచి జరిగే మ్యాచ్‌లలో డ్రా అనే మాటే ఉండదు.. నిర్ణీత సమయంలోగా కూడా ఎవరూ గోల్స్ చేయకపోతే.. పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఈ రౌండ్ 32లో గెలిచిన 16 జట్లు రౌండ్ 16 (ప్రిక్వార్టర్స్)కు వెళ్లనున్నాయి. అక్కడి నుంచి క్వార్టర్స్ (8 టీమ్‌లు), సెమీస్ (4 టీమ్‌లు) దాటుకుని ఫైనల్లో కప్పు కోసం ఢీకొట్టుకుంటాయి.
రౌండ్ 32 హై-వోల్టేజ్ మ్యాచుల షెడ్యూల్:
* జూన్ 29: బ్రెజిల్ VS జపాన్
* జూన్ 29: దక్షిణాఫ్రికా VS కెనడా
* జూన్ 30: ఐవరీ కోస్ట్ VS నార్వే
* జూన్ 30: జర్మనీ VS పరాగ్వే
* జూన్ 30: నెదర్లాండ్స్ VS మొరాకో
* జూలై 1: ఫ్రాన్స్ VS స్వీడన్
జూలై 1: మెక్సికో VS ఈక్వెడార్
* జూలై 1: ఇంగ్లాండ్ VS డీఆర్ కాంగో
* జూలై 2: యూఎస్ఏ VS బోస్నియా
* జూలై 2: బెల్జియం VS సెనెగల్
జూలై 3: స్పెయిన్ VS ఆస్ట్రియా
* జూలై 3: స్విట్జర్లాండ్ VS అల్జీరియా
* జూలై 3: పోర్చుగల్ VS క్రొయేషియా
జూలై 3: ఆస్ట్రేలియా VS ఈజిప్ట్
* జూలై 4: అర్జెంటీనా VS కేప్ వెర్డె
* జూలై 4: కొలంబియా VS ఘనా