
హర్షిత్ రెడ్డి, మణిమేగలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన చిత్రం ‘దీవాన’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం థ్యాంక్స్ మీట్‌ను శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘సినిమా చూశా. చాలా బాగుంది. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ చూడలేదు. పాత్రలపై ప్రేమతో డైరెక్టర్‌పై కోపం వచ్చింది. క్లైమాక్స్ వచ్చేసరికి మనకొక ఫుల్ ఫీల్‌నెస్ వస్తుంది.
ఇదొక బ్యూటిఫుల్ సినిమా. ప్రతి ఒక్కరూ చూసి ప్రోత్సహించండి. నావంతు సపోర్ట్‌గా శనివారం ఏపీ తెలంగాణలోని ప్రతి ఊర్లో ఫస్ట్ 25 టికెట్స్ కొన్నవారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం. చూసినవాళ్లకు నచ్చితే మరొకరిని థియేటర్‌కు తీసుకెళ్లండి లేదా ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టండి. నచ్చకపోతే నెక్స్ట్ నా సినిమా వచ్చినప్పుడు వడ్డీతో కలిపి ఇచ్చేస్తా’ అని చెప్పాడు. నిజాయితీతో చేసిన ప్రేమ కథ కాబట్టే ‘దీవాన’ విజయం సాధించిందని నటుడు వీకే నరేష్ అన్నారు.
హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘ఎలాంటి స్టార్ పవర్ లేకున్నా ఫస్ట్ వీక్ తర్వాత కూడా 70 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందంటే అదే మాకు నిజమైన సక్సెస్‌గా భావిస్తున్నాం’ అని అన్నాడు. డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ ‘ఏ భాషలో రాని సినిమా ఇది. థియేటర్‌లో వస్తేనే నాకు ఆనందం’ అని చెప్పాడు.
గుర్తుండిపోయే సినిమా చేసినందుకు సంతోషంగా ఉందని నిర్మాత శ్రీదేవి చెప్పారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, పీవీఆర్ స్క్రీన్స్ లో రూ.105లకే టికెట్ రేటు పెట్టామని నిర్మాత వాసుదేవ్ చెప్పారు. నటీనటులు రఘు కారుమంచి, సింధు, నర్సింగ్ వాడేకర్, టోనీ, కేకే, మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్, డీవోపీ వంశీ పచ్చిపులుసు సహా టీమ్ అంతా పాల్గొన్నారు.