Reading Time: < 1 minute
Actress Trisha Krishnan Bold Comments On Marriage And Divorce Viral

Trisha: దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న అందాల భామ త్రిష. ఈ స్టార్ హీరోయిన్ పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. 40 ఏళ్లు దాటినా ఇంకా సింగిల్‌గానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ .. తాజాగా తన పెళ్లి, వ్యక్తిగత జీవితంపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. పెళ్లిపై తనకున్న స్పష్టమైన అభిప్రాయాన్ని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వివాహం గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను పెళ్లిని ఒక ఆటగా భావించడం లేదని స్పష్టం చేశారు. “నేను ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు తీసుకోను. జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి కోసమే నా అన్వేషణ” అని వెల్లడించారు. ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎంత వేగంగా అవుతున్నాయో, అంతే వేగంగా విడాకుల వరకు వెళ్తున్నాయనే విషయాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు.

పెళ్లి విషయంలో తాను ఇంత కఠినంగా ఉండటానికి గల కారణాన్ని కూడా త్రిష బయటపెట్టారు. “నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో చాలామంది పెళ్లిళ్లు చేసుకుని ప్రస్తుతం తీవ్రమైన మానసిక బాధను అనుభవిస్తున్నారు. కేవలం సమాజం కోసమో, వయసు అయిపోతుందనో పెళ్లి చేసుకుని జీవితాన్ని నరకం చేసుకోలేను. నా స్నేహితుల్లా నేను బాధపడాలని అనుకోవడం లేదు” అని త్రిష చెప్పుకొచ్చారు. తన మనసుకు నచ్చిన, తనకు సరిపోయే సరైన వ్యక్తి దొరికినప్పుడే తాను వివాహ బంధంలోకి అడుగుపెడతానని త్రిష స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి తోడు దొరకకపోతే ఏం చేస్తారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. “ఒకవేళ నాకు తగ్గ వ్యక్తి దొరక్కపోయినా పర్లేదు.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడానికైనా సిద్ధమే తప్ప, తప్పుడు నిర్ణయం తీసుకోను” అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.