Reading Time: < 1 minute

హార్మూజ్‏లో మళ్లీ హై టెన్షన్.. ఆయిల్ ట్యాంకర్‎పై మిస్సైల్ అటాక్

Caption of Image.

న్యూఢిల్లీ: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూ్జ్ జలసంధిలో మళ్లీ హై టెన్షన్ నెలకొంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోన్న ఓ ఆయిల్ ట్యాంకర్‎పై గుర్తు తెలియని మిస్సైల్ దాడి జరిగింది. అమెరికా-ఇరాన్ మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత హార్మూజ్ జలసంధిలో వాణజ్య నౌకపై దాడి జరగడం ఇదే తొలిసారి. 

ఈ దాడిని బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ యూకేఎమ్‌టీఓ ధృవీకరించింది. హార్మూజ్ జలసంధిలో పనామా జెండా కలిగిన KIKU అనే ఆయిల్ ట్యాంకర్‎పై మిస్సైల్ దాడి జరిగినట్లు తెలిపింది. ఈ దాడిలో ఓడలోని బ్రిడ్జికి నష్టం వాటిల్లిందని.. అందులోని సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. దాడి ఎవరూ చేశారనే దానిపై క్లారిటీ లేదని పేర్కొంది.  

మిడిల్ ఈస్ట్‎లో సుధీర్ఘకాలంగా కొనసాగుతోన్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్ వేదికగా ఇరుదేశాలు చర్చలు జరిపాయి. ఈ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత కూడా అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. 

ఇరాన్‎పై అమెరికా బలగాలు దాడులు చేయగా.. ఈ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై తాము దాడి చేసినట్లు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అమెరికా, ఇరాన్ దాడులు, ప్రతీకార దాడులతో పశ్చిమాసియా, హార్మూజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

©️ VIL Media Pvt Ltd.