Reading Time: < 1 minute

మంత్రి వివేక్ చొరవతో తీరిన తాగునీటి సమస్య

Caption of Image.
  • శంకర్​పల్లి పంచాయతీలో రెండు బోర్​ వెల్స్​ ఏర్పాటు

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి చొరవతో రెండు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్​పల్లి పంచాయతీ పరిధిలోని శంకర్​పల్లి, సండ్రోనిపల్లి గ్రామాల్లో రూ.4 లక్షల సీఎస్​ఆర్​ నిధులతో రెండు బోర్​వెల్స్ ఏర్పాటు చేశారు.

గ్రామాల్లో తాగునీటి సమస్యలను కాంగ్రెస్ నేతలు, 
ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మంత్రి వివేక్​దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన వెంటనే రెండు బోర్​వెల్స్​ మంజూరు చేశారు. సమస్యను పరిష్కరించిన మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు, నేతలు కృతజ్ఞతలు తెలిపారు. బోర్​వెల్స్ ఏర్పాటు కార్యక్రమంలో సర్పంచ్ పి.వెంకటేశ్, మండల అధ్యక్షుడు కె.జీవన్ కుమార్, ఉపాధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.