Reading Time: 2 minutes

Peddi OTT Release: ఓటీటీలోకి రామ్ చరణ్ ‘పెద్ది’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

Caption of Image.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi).  జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం.., బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. టాక్‌తో సంబంధం లేకుండా చరణ్ మాస్ రాంపేజ్‌కు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్..

ఈ ‘పెద్ది’ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 3వ వారంలో రన్ అవుతున్న ఈ సినిమా, వీక్‌డేస్‌లో ఆక్యుపెన్సీ కొద్దిగా తగ్గినప్పటికీ స్టెడీగా సాగుతోంది.  ప్రస్తుతం థియేటర్లలో సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ, మాస్ సెంటర్లలో ‘పెద్ది’ హవా తగ్గలేదు.

నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’ సందడి…

థియేట్రికల్ రన్‌తో దుమ్మురేపుతున్న ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు సంబంధించి ఫిలింనగర్‌లో ఒక క్రేజీ బజ్ నడుస్తోంది. పెద్ది’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఏకంగా రూ. 105 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.  మొదట జూలై 2న ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని భావించినప్పటికీ, థియేటర్లలో కలెక్షన్స్ బాగుండటంతో డేట్‌ను రివైజ్ చేసినట్లు టాక్.  లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, జూలై 16న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా డిజిటల్ స్క్రీన్స్ పైకి రానుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by OTT NIGHTS 🎬 (@ottnights)

 

బుచ్చిబాబు సన పల్లెటూరి నేపథ్యంలో విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో చరణ్ సరసన లక్కీ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. మొత్తానికి థియేటర్లలో రూ. 400 కోట్లతో రికార్డులు తిరగరాసిన ‘పెద్ది’.. ఇక ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి…

 

©️ VIL Media Pvt Ltd.