Reading Time: 2 minutes
OTT Movie: ఓటీటీలో మరో మలయాళం సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDB టాప్ రేటింగ్ మూవీ

ఓటీటీలో మలయాలం సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఆ భాష నుంచి వచ్చే క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లను ఓటీటీ ఆడియెన్స్ తెగ చూస్తున్నారు. అలా తాజాగా మరో మలయాళం సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రానుంది. ‘ప్రేమలు’ తో తెలుగులోనూ అభిమానులు సంపాదించుకున్న హీరో నస్లేన్ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించాడు. సైకలాజికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పేరు మాలీవుడ్ టైమ్స్. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే నెల రోజులు తిరగకుండానే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. మాలీవుడ్ టైమ్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జులై 03 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానుంది .ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మాలీవుడ్ టైమ్స్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.

మాలీవుడ్ టైమ్స్ విషయానికి వస్తే..అభినవ్ సుందర్ నాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
నస్లెన్ తో పాటు బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్, షరాఫ్ ఉద్దీన్, సంగీత్ ప్రతాప్, రోషన్ షానవాస్, రాజేష్ మాధవన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే.. స్పీల్ బర్గ్, ఆర్జీవీ దర్శకుల స్ఫూర్తితో సినిమా ఇండస్ట్రీలో రాణించాలనుకుంటాడు హీరో నస్లేన్. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ గా అవకాశం వస్తుంది. తన ఫస్ట్ మూవీని ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తాడు. అయితే తన కథను వేరే వ్యక్తి మూవీగా ముందే తీస్తాడు. దీంతో తన మూవీని చావుతో కనెక్ట్ చేసి హిట్ చేద్దామనుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే మాలీవుడ్ టైమ్స్ సినిమా చూడాల్సిందే.

జియో హాట్ స్టార్ లో మాలీవుడ్ టైమ్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.