చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని మితంగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతుంటారు నిపుణులు. చికెన్ మంచిది, తాజాగా ఉంటే, దానిని తినడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. కానీ చికెన్ నాణ్యత లోపిస్తే మాత్రం ఆసుపత్రి పాలు అవ్వడమేనంట.
చికెన్ రేట్లు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంచిది చికెన్ ఎలా ఉన్నా మార్కెట్లో ఎక్కువగా సేల్ చేస్తున్నారు. అందువలన మీరు చికెన్ కొనుగోలు చేసే ముందు తప్పకుండా దాని రంగు చూడాలి అంటే, దాని రంగు మారినట్లు కనిపిస్తే దానిని కొనుగోలు చేయకుండా ఉండటమే మంచిదంట.
లేత గులాబీ రంగులో చికెన్ ఉంటే అది తాజా చికెన్ అన్నట్లు, అయితే ఒక వేళ చికెన్ జిగటగా, పసుపు రంగులో ఉన్నట్లు అయితే దానిని అస్సలే కొనుగోలు చేయకూడదంట. ఇది ఫుడ్ పాయిజన్ వంటి అనేక సమస్యలకు కారణం అవుతుందంట. అందువలన లేత పసుపు రంగులో చికెన్ కనిపించినట్లు అయితే దానిని కొనుగోలు చేయకూడదు అంటున్నారు వైద్య నిపుణులు.
అదే విధంగా చికెన్ బూడిద రంగు, ఆకు పచ్చ రంగులో కనిపించినట్లు అయినా దానిని అస్సలే కొనుగోలు చేయకూడదంట, ఇది ప్రాణాలకే ముప్పు తీసుకొస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు, ఇలాంటి చికెన్ తినడం వలన వాంతులు ,విరేచనాలు, కడుపు నొప్పి వంటి అనేక సమస్యలు ఎదురు అవుతాయంట.
నోట్: పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.




