Reading Time: < 1 minute

జైలుకు గోల్డ్మెన్ సూర్య భాయ్.. తక్కువ ధరకు బంగారం కేసులో 14 రోజుల రిమాండ్

Caption of Image.

నారాయణగూడ, వెలుగు: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.32 లక్షలు మోసం చేసిన కేసులో పల్లాపు సురేశ్ ​అలియాస్ గోల్డ్​మెన్​ సూర్యభాయ్‌‌ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

శనివారం పోలీస్‌‌స్టేషన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణగూడ సీఐ సైదేశ్వర్ వివరాలు వెల్లడించారు. హయత్‌‌నగర్‌‌కు చెందిన గోల్డ్‌‌స్మిత్ వ్యాపారి కృష్ణాచారిని సూర్యభాయ్ తక్కువ ధరకే బంగారం అందిస్తానని నమ్మించి పలు దఫాలుగా రూ.32 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు.

బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి శనివారం సూర్యభాయ్​ను అరెస్ట్ చేశామన్నారు. కోర్టులో హాజరుపరచగా, నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.

అతడిని చంచల్‌‌గూడ జైలుకు తరలించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, సూర్యభాయ్‌‌పై గతంలో మంగళ్‌‌హాట్ పోలీస్‌‌స్టేషన్ పరిధిలో కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసులో ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

©️ VIL Media Pvt Ltd.