
టాలీవుడ్ మాస్ సినిమాలకు నార్త్ ఇండియాలో, ముఖ్యంగా యూట్యూబ్‌లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో యావరేజ్‌గా ఆడిన సినిమాలు కూడా హిందీలోకి డబ్ అయి యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతుంటాయి. అయితే, టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ చిత్రం ఏకంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘ఖూన్‌ఖార్’ (Khoonkhar) యూట్యూబ్‌లో ఏకంగా 100 కోట్ల (1 బిలియన్) వ్యూస్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. దర్శకుడు బోయపాటి శ్రీను మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రాకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ నార్త్ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. గతంలోనే అత్యంత వేగంగా 20 కోట్ల, 30 కోట్ల వ్యూస్ దాటిన డబ్బింగ్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు ఏకంగా 100 కోట్ల వ్యూస్ మైలురాయిని దాటిన తొలి భారతీయ డబ్బింగ్ సినిమాగా ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‌తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..
నార్త్ ఇండియాలో బెల్లంకొండ క్రేజ్:
ఈ రికార్డుతో నార్త్ బెల్ట్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఉన్న అసాధారణ క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ఆయన నటించిన ‘అల్లుడు శీను’, ‘కవచం’, ‘సీత’ వంటి చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు కూడా యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఈ క్రేజ్ కారణంగానే ఆయన ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి థియేటర్లలో సాధించిన కలెక్షన్ల కంటే, యూట్యూబ్‌లో ‘జయ జానకి నాయక’ సాధించిన ఈ వంద కోట్ల వ్యూస్ రికార్డ్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అపూర్వ విజయం టాలీవుడ్ మాస్ కంటెంట్‌కు నార్త్ మార్కెట్‌లో ఉన్న తిరుగులేని డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
భారతీయ సినీ చరిత్రలో యూట్యూబ్ వేదికగా వంద కోట్ల వ్యూస్ సొంతం చేసుకున్న తొలి డబ్బింగ్ సినిమా ఖూన్ ఖార్ నిలిచింది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిన కేజీఎప్ చాప్టర్ 1 సినిమా హిందీ వెర్షన్ 861 మిలియన్ వ్సూస్ తో రెండో స్థానంలో ఉందంటే.. డిజిటల్ మార్కెట్లో బెల్లంకొండ సినిమాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. జయ జానకి నాయక సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ సాంగ్స్ సూపర్ హిట్ అందుకున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో..
ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..