
టాలీవుడ్ బ్యూటీ సమంత మూవీ ‘ మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటికే రూ. కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా సక్సెస్‌తో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతుంది ఈ మూవీ టీం. ఈక్రమంలో లేటెస్ట్ గా ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇచ్చేలా మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ (పార్ట్-2) రాబోతోందని చిత్ర నిర్మాత రాజ్ నిడిమోరు అధికారికంగా ప్రకటించారు.
మా ఇంటి బంగారం మూవీకి సీక్వెల్..
వైజాగ్‌లో జరిగిన సినిమా సక్సెస్ మీట్‌లో చిత్ర నిర్మాత రాజ్ నిడిమోరు ఆసక్తిరమైన వెల్లడించారు. నా మైండ్‌లో ఆల్రెడీ ఒక అదిరిపోయే ఐడియా ఉంది. ఇదే టీమ్‌తో పార్ట్-2 ప్లాన్ చేస్తున్నాం అంటూ.. ఈ చిత్రానికి సీక్వెల్ (పార్ట్-2) రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగానికి మించి డబుల్ ఫన్, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇందులో ఉంటుంది అంటూ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించారు.
ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ‘ట్రా లా లా పిక్చర్స్’ కూడా సోషల్ మీడియా వేదికగా సీక్వెల్‌ను అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. తాను గతంలో చేసిన ‘స్త్రీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి బ్లాక్‌బస్టర్స్ కంటే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్ తన గుండెకు హత్తుకుందని ఎమోషనల్ అయ్యారు.
ప్రెగ్నెన్సీ వార్తలపై సామ్ క్లారిటీ
నందిని రెడ్డి దర్శకత్వంలో 1980ల నాటి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ‘స్వర్ణ’గా సమంత నటనకు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. వరల్డ్‌వైడ్‌గా రూ.60 కోట్లు దాటేసి అత్యధిక వసూళ్లు సాధించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా ఇది రికార్డు సృష్టించింది. ఇక సినిమా షూటింగ్ సమయంలోనే సమంత ప్రెగ్నెన్సీతో ఉన్నారని దర్శకురాలు నందిని రెడ్డి ఇటీవల రివీల్ చేశారు. మార్నింగ్ సిక్నెస్ ఉన్నప్పటికీ సామ్ ఒక సాంగ్ షూటింగ్‌ను పూర్తి చేశారట.
రీసెంట్‌గా ప్రమోషన్స్‌లో సామంత స్వయంగా స్పందిస్తూ.. తాను త్వరలోనే మెటర్నిటీ లీవ్‌లోకి వెళ్తున్నానని, డెలివరీ తర్వాత మళ్లీ సరికొత్తగా కమ్‌బ్యాక్ ఇస్తానని క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. భర్త రాజ్ నిడిమోరు నిర్మాణంలో, త్వరలోనే రాబోయే సీక్వెల్‌తో సామ్ మళ్లీ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి..