Reading Time: < 1 minute
Cm Chandrababu July District Tour

ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 1వ తేదీ నుంచి వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనల్లో పలు సంక్షేమ, అభివృద్ది కార్యమాల్లో సిఎం పాల్గొననున్నారు. 1వ తేదీ పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడులతో హీరో సంస్థ ఈ పార్ట్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. దీనికి శంకుస్థాపన చేయనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.

అదే రోజు సాయంత్రం తిరుపతి పట్టణంలో ప్రైవేటు హోటల్ లో జరిగే GSDP కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ నకు హాజరవుతారు. ఈ వర్క్ షాప్ నకు నీతి ఆయోగ్ సభ్యులతో పాటు, పీఎం ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారు. రెండవ తేదీ రాత్రి తిరుపతిలోనే సిఎం బస చేస్తారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మూడు రోజుల పర్యటనలో భాగంగా అక్కడి నుంచి సిఎం చంద్రబాబు కుప్పం బయలుదేరి వెళతారు. 3 తేదీ నుంచి 5 వతేదీ వరకు సిఎం కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5వ తేదీన అమరావతికి తిరిగి చేరుకుంటారు.