Reading Time: < 1 minute
6 2 Magnitude Earthquake Hits Afghanistan Tremors Felt In India And Pakistan

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్‌తో పాటు భారత వాయువ్య ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీల్లో ప్రకంపలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప కేంద్రం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌లోని కలాఫ్‌గాన్‌కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్ మరియు తుర్క్‌మెనిస్తాన్‌లలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం చాలా లోతులో సంభవించడం వల్ల దీని ప్రభావం చుట్టుపక్కల చాలా దేశాల్లో కనిపించింది. లోతు కారణంగా ఉపరితలంపై భూకంప నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంది.