
China-Pakistan: చైనా మరోసారి పాకిస్తాన్‌తో ఉన్న స్నేహం గురించి గొప్పగా మాట్లాడింది. పాకిస్తాన్ ప్రధాని షెహజాబ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లు చైనాలో పర్యటిస్తున్నారు. షరీఫ్‌తో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశమయ్యారు. పాకిస్తాన్-చైనా బంధాన్ని ‘‘అన్ని కాలాలకు అనువైన వ్యూహాత్మక భాగస్వామ్యం’’గా జిన్ పింగ్ అభివర్ణించారు. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారినా పాకిస్తాన్‌తో సంబంధాలకు చైనా ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
బీజింగ్‌లోని గ్రేట్ హాట్ ఆఫ్ ది పీపుల్‌లో ఇరు దేశాధినేతల సమావేశం జరిగింది. ఉమ్మడి భవిష్యత్తు కోసం ఇరు దేశాల కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలనున మాత్రమే చైనా తన ‘‘ఆల్-వెదర్ పార్ట్‌నర్స్’’గా పరిగణిస్తుందని, పాకిస్తాన్ ఇందులో ఒకటిగా ఉంది. ప్రతీసారి ఈ రెండు దేశాల సంబంధాలను ‘‘ పాల కన్నా స్వచ్ఛమైంది, హిమాలయాల కన్నా ఎత్తైంది, తేనె కన్నా తియ్యనైనది’’గా పిలుస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ, ఆర్థిక, వ్యూహాత్మక సన్నిహిత సహాకారం ఉంది.
ఈ సమావేశంలో షహజాబ్ షరీఫ్ మాట్లాడుతూ.. చైనా-పాకిస్తాన్‌ను ‘‘స్టీల్ బ్రదర్స్’’గా అభివర్ణించారు. ప్రపంచంలో ఇలాంటి బలమైన సంబంధాలు మరే రెండు దేశాల మధ్య లేవని అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రపై జిన్‌పింగ్ ప్రశంసలు కురిపించారు. ఇరాన్ శాంతి కోసం షరీఫ్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని అన్నారు.