Reading Time: 2 minutes
Viral Video: పెళ్లిలో పానీపూరి రచ్చ.. ఒక్కసారిగా ఎగబడ్డ జనం.. చిర్రెత్తిన స్టాల్ ఓనర్ ఏం చేశాడంటే?

Pani Puri Stall Fight: భారతీయ వివాహాలంటే కేవలం సంప్రదాయాలు, ఆచారాలు మాత్రమే కాదు.. నోరూరించే విందు భోజనాలు కూడా! ముఖ్యంగా పెళ్లిళ్లలో ఫుడ్ స్టాళ్ల దగ్గర ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా బీహార్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో పానీపూరి స్టాల్ దగ్గర బంధువులు చేసిన రచ్చకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

నోరూరించే పానీపూరి.. ఆగలేకపోయిన పెళ్లి జనం..!

పానీపూరి లేదా గోల్‌గప్పా అనే పేరు వినగానే ఎవరికైనా నోరూరడం సహజం. ఆ పుల్లని, ఘాటైన నీటితో నింపిన పూరీలను తింటుంటే ఎంత తిన్నా తనివితీరదు. సాధారణంగా పెళ్లిళ్లలో పానీపూరి కౌంటర్ల దగ్గర జనం క్యూ కట్టడం చూస్తుంటాం. కానీ, బీహార్‌కు చెందిన ఈ వైరల్ వీడియోలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అక్కడ పానీపూరి స్టాల్ తెరిచారో లేదో.. పెళ్లికి వచ్చిన బంధువులు, బారాత్ సభ్యులు ఒక్కసారిగా ఆ బండిపై దాడి చేసినంత పనిచేశారు. లైన్లు లేవు, పద్ధతులు లేవు.. ఎవరికి వారే ముందుగా తినాలని ఎగబడ్డారు.

ఇది కూడా చదవండి: Video: నల్లతాచుతో మొసలి భీకర పోరాటం.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో చూస్తారా..?

పాపం పానీపూరి మాస్టర్.. చేతులెత్తేసి ఏం చేశాడంటే?

స్టాల్ చుట్టూ జనం విపరీతంగా గుమిగూడటంతో ఒక్కొక్కరికీ ప్లేటులో పానీపూరి అందించడం ఆ వ్యాపారికి సాధ్యం కాలేదు. జనం తొందరపాటు, ఆకలి చూసి ఆ పానీపూరి మాస్టర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు విసిగిపోయిన అతడు.. ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. స్పూన్లతో కాకుండా, ఏకంగా గుప్పెళ్ల కొద్దీ పూరీలను చేతిలోకి తీసుకుని, పానీలో ముంచి నేరుగా జనం చేతుల్లో పెట్టడం ప్రారంభించాడు. జనం కూడా ఏమాత్రం మొహమాటపడకుండా ఆ చేతుల్లోంచి అందుకని ఆరగించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో వ్యూస్ వర్షం.. నెటిజన్ల నవ్వుల పువ్వులు..

‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసిన ఈ వీడియోకు “పెళ్లిలో మొదటిసారి పానీపూరి కౌంటర్ తెరిచినప్పుడు..” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ వీడియోను రెండు లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించగా, వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “పానీపూరిపై భారతీయులకు ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు” అని ఒకరు కామెంట్ చేయగా.. “కౌంటర్ తెరవగానే బారాత్ జనం ఆకలి సింహాల్లా విరుచుకుపడ్డారు” అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. బీహార్ వాసులు ఏం చేసినా అది వైరల్ కాక తప్పదంటూ మరికొందరు నవ్వుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Video: చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు.. వీడియో చూస్తే చెమటలు పట్టేస్తాయ్..!

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..