Best Scooters: మీరు ప్రయాణానికి సరసమైన, అందమైన, మంచి మైలేజీ ఇచ్చే స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే ఇవి తెలుసుకోవాల్సిందే. మార్కెట్లో ఎన్నో స్కూటర్ కంపెనీలు, వందలాది ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) ఉండటంతో ప్రతిరోజూ అనేక కొత్త మోడళ్లు పరిచయం అవుతుండటంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి వాతావరణంలో మీరు ఆఫీసు ఉపయోగం కోసం ఒక వాహనాన్ని కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వాహనాల గురించి తెలుసుకోవాల్సిందే.
యమహా ఏరాక్స్ 155: ఇది ప్రస్తుతం భారతీయ యువతలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘పెర్ఫార్మెన్స్ మ్యాక్సీ స్కూటర్’. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ. 1.43 లక్షల నుండి రూ. 1.46 లక్షల వరకు ఉంటుంది. సొగసైన ట్విన్-LED హెడ్లైట్లు మరియు క్లాసీ ఫ్రంట్ డిజైన్‌తో దీని రూపం చాలా స్పోర్టీగా ఉంటుంది. ఆఫీసుకు వెళ్లేవారు దీనిపై ప్రయాణిస్తున్నప్పుడు దీని పదునైన, ప్రత్యేకమైన రూపం రోడ్డుపై ఉన్న ప్రతి ఒక్కరి దృష్టిని నిస్సందేహంగా ఆకర్షిస్తుంది. ఇది 42- 48కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని తెలుస్తోంది. ఈ స్కూటర్‌కు R15లో ఉన్నటువంటి అదే 155cc, లిక్విడ్-కూల్డ్, 4-వాల్వ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 14.75 bhp పవర్, 13.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ముఖ్య ఫీచర్లలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, సింగిల్-ఛానల్ ABSతో కూడిన ఫ్రంట్ డిస్క్ బ్రేకులు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కన్సోల్ ఉన్నాయి. దీని పెద్ద 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెడల్పాటి టైర్లు రైడింగ్ చేసేటప్పుడు అద్భుతమైన స్థిరత్వాన్ని అందిస్తాయి.
బెర్గ్మాన్ స్ట్రీట్ 125: ఇది చాలా సరసమైన ‘మాక్సీ-స్టైల్’ స్కూటర్. దీని ధర రూ. 1.02 లక్షల నుండి రూ. 1.13 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. దీని డిజైన్ యూరోపియన్ మాక్సీ స్కూటర్ల నుండి ప్రేరణ పొందింది. ఇందులో పెద్ద విండ్‌స్క్రీన్, వెడల్పాటి ముందు భాగం, సౌకర్యవంతమైన లెగ్‌రూమ్ ఉన్నాయి. ఆఫీస్ బ్యాగులు, ఇతర అవసరమైన వస్తువులను నిల్వ చేయడానికి సీటు కింద 24.6 లీటర్ల పెద్ద స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇది లీటర్‌కు 48 నుంచి 50 కిలోమీట్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది మెరుగైన పనితీరును అందించే 124cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 8.58 PS పవర్, 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల నగర ట్రాఫిక్‌లో దీనిని నడపడం సులభం అవుతుంది. దీని ఉన్నత శ్రేణి మోడళ్లలో ఇప్పుడు 4.2-అంగుళాల కలర్ TFT డిస్ప్లే, బ్లూటూత్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, కీలెస్ ఇగ్నిషన్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ లీటరుకు సుమారు 55 నుండి 59 కిలోమీటర్ల మంచి మైలేజీని ఇస్తుంది. అందువల్ల ఇది రోజువారీ ఉపయోగం కోసం ఒక పొదుపైన ఎంపిక.
హీరో జూమ్ 160: సుమారు రూ. 1.40 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో హీరో మోటోకార్ప్ ‘జూమ్ 160’తో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ‘అడ్వెంచర్ మ్యాక్సీ స్కూటర్’ విభాగంలోకి ప్రవేశించింది. దీని డిజైన్, ఎత్తైన విండ్‌స్క్రీన్, ఎత్తైన సీటు దీనికి గ్రాండ్ టూరర్ రూపాన్ని ఇస్తాయి. సోమవారం నుండి శుక్రవారం వరకు పని చేసిన తర్వాత వారాంతాల్లో సుదూర ప్రయాణాలు లేదా తేలికపాటి ఆఫ్-రోడ్ సాహసాలు చేయాలనుకునే వారికి ఇది చాలా అనువైనది. ఈ స్కూటర్లో 156cc, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 14 bhp పవర్, 14 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హీరో ఫీచర్ల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. వీటిలో స్మార్ట్ కీ (కీలెస్ గో), i3S సైలెంట్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డ్యూయల్-ఛాంబర్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. దీని 14-అంగుళాల బ్లాక్-ప్యాటర్న్ టైర్లు కఠినమైన భూభాగాలపై కూడా అద్భుతమైన పట్టు, భద్రతను అందిస్తాయి. ఇది లీటర్‌కు 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
కీవే వియెస్ట్ 300: మీరు తక్కువ బడ్జెట్లో ఉంటూనే రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే కీవే వియెస్ట్ 300 ఒక గొప్ప ఎంపిక. దీని ధర రూ.3.02 లక్షల నుండి రూ. 3.25 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. దీని హంగేరియన్ డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ముందు భాగంలో నాలుగు ప్రకాశవంతమైన LED ప్రొజెక్టర్ హెడ్లైట్లు, ఆకర్షణీయమైన యూరోపియన్ ‘మాక్సీ’ స్టైల్ డిజైన్‌తో ఇది సాధారణ స్కూటర్ల కంటే ప్రత్యేకంగా, ఖరీదైనదిగా కనిపిస్తుంది. ఈ మ్యాక్సీ స్కూటర్లో 278.2cc సామర్థ్యం గల పెద్ద సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 18.95 PS పవర్ మరియు 22 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం 120-125 kmph. మీరు మీ పని పూర్తి చేసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా హైవేపై ప్రయాణించవచ్చు. భద్రత పరంగా దీనికి రెండు చక్రాలపై డిస్క్ బ్రేకులు, డ్యూయల్-ఛానల్ ABS, కీ-లెస్ ఇగ్నిషన్, 12 లీటర్ల సామర్థ్యం గల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి.




