Reading Time: < 1 minute
Viral Video Woman Urinates In Dining Area Of Dhaba Sparks Outrage On Social Media

Viral Video: మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతంలోని ఓ రోడ్డుపక్కన ఉన్న ఢాబాలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ మహిళ అక్కడ అందుబాటులో ఉన్న మరుగుదొడ్డిని ఉపయోగించకుండా.. కస్టమర్లు భోజనం చేస్తున్న ప్రదేశంలోనే బహిరంగంగా మూత్ర విసర్జన చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనతో అక్కడ ఉన్న సిబ్బంది, భోజనానికి వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

వీడియోలో మరో మహిళ ఈ ఘటనను చిత్రీకరిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మహిళా వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో “ఇక్కడ పిల్లలు కూర్చొని ఉన్నారు.. మేమంతా భోజనం చేస్తున్నాం” అంటూ ఆమె ఆ మహిళను ఉద్దేశించి మాట్లాడింది. రెస్టారెంట్ లోనే టాయిలెట్ సౌకర్యం ఉన్నప్పటికీ.. ఆ మహిళ పట్టించుకోకుండా వ్యవహరించినట్లు వీడియోలో కనిపించింది. ఈ విషయాన్నీ వీడియో తీస్తున్న మహిళ ఢాబా సిబ్బందికి తెలపడంతో.. మేనేజర్ సహా పలువురు అక్కడికి చేరుకుని మహిళను నిలదీశారు. అయితే ఆమె తన తప్పును అంగీకరించకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మహిళపై దారుణంగా విరుచుకపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి ప్రవర్తన ప్రజారోగ్యం, పరిశుభ్రత ప్రమాణాలకు విరుద్ధమని పలువురు కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం మహిళ చర్య తప్పేనని అంగీకరిస్తూనే, ఆమె వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం ఆమెకు అసలు మెదడు పనిచేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.