
ప్రముఖ దర్శకుడు, కథా రచయిత, నటుడు K భాగ్యరాజ్ మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తమ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కేవలం రెండు రోజుల క్రితమే (జూన్ 25న) గోవాలో జరిగిన ఖుష్భు కుమార్తె పెళ్లి వేడుకలో కలిసి నవ్వుతూ, సరదాగా గడిపామని, ఇప్పుడు ఆయన మరణ వార్త వినడం నమ్మలేకపోతున్నానని చిరు ఎమోషనల్ అయ్యారు.
‘‘నా హృదయం ముక్కలైంది. ఈ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మాటల్లో చెప్పలేనంత షాక్‌కు గురయ్యాను. మొన్నటికి మొన్న గోవాలో జరిగిన ఖుష్భు కుమార్తె పెళ్లి వేడుకల్లో కలిసి పాల్గొని, నవ్వులు పంచుకున్నాం. భాగ్యరాజ్ గారు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ ఉదయం ఆయన మరణ వార్త విని నమ్మలేకపోయాను’’ అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
అద్భుతమైన దర్శకుడు, అసాధారణమైన స్క్రీన్‌ప్లే రచయిత, ప్రతిభావంతుడైన నటుడిగా భారతీయ సినీ పరిశ్రమకు భాగ్యరాజ్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. భాగ్యరాజ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని లోటును భరించే శక్తిని దేవుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు.
Deeply shocked and heartbroken beyond words.
Just the day before yesterday, we were together in Goa at Kush’s wedding, laughing, sharing jokes, and taking pictures. Bhagyaraj garu was full of life and joy. To wake up to the news of his passing this morning is simply…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 27, 2026
భాగ్యరాజ్ చివరి వీడియో వైరల్..
ఈఖుష్భు కుమార్తె పెళ్లి వేడుకకు భాగ్యరాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. పట్టు ధోవతి, పట్టు చొక్కాలో సంప్రదాయబద్ధంగా కనిపించిన ఆయన వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వేదికపైకి వస్తున్న భాగ్యరాజ్‌కు మెగాస్టార్ చిరంజీవి చేయి అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు. వీరిద్దరి మధ్య జరిగిన ఆ ఆప్యాయ క్షణాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది.
ALSO READ : ఓటీటీలోకి సెన్సేషనల్ మలయాళ డార్క్ కామెడీ
#Kushbusundar గారు కుమార్తె
వివాహ వేడుకలో చిరంజీవి గారు భాగ్యరాజ్ గారు కలిసిన వీడియో..#Chiranjeevi #Baghyaraj #Wedding pic.twitter.com/POcRQp9AfP— SZN (@Suzenbabu) June 27, 2026
మరోవైపు వెంకటేష్ కూడా భాగ్యరాజ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ఆయన సృష్టించిన కథలు భాషల హద్దులను దాటి కోట్లాది ప్రేక్షకుల హృదయాలను తాకాయి. సుందరకాండ, అబ్బాయిగారు వంటి చిత్రాల్లో భాగమయ్యే అవకాశం రావడం నా అదృష్టం. భారతీయ సినిమా తన అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిని కోల్పోయింది’’ అని పేర్కొన్నారు. భాగ్యరాజ్ మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక గొప్ప దర్శకుడిని, కథకుడిని కోల్పోయిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Deeply saddened by the passing of Bhagyaraj Sir. His work transcended languages and touched the hearts of millions. I feel fortunate to have been a part of films like Sundarakanda and Abbaigaru, which were born from his remarkable storytelling. Indian cinema has lost one of its… pic.twitter.com/7Ul9bZTPH8
— Venkatesh Daggubati (@VenkyMama) June 27, 2026
విలక్షణమైన కథలకు నిలువెత్తు రూపం K. భాగ్యరాజ్..
ఇండియన్ సినీ పరిశ్రమలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసింది. విలక్షణమైన కథలు, వినూత్న స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించిన నటుడు, దర్శకుడు K. భాగ్యరాజ్.. ఇవాళ శనివారం (జూన్ 27, 2026న) కన్నుమూశారు. 73 ఏళ్ళ వయసులో తీవ్ర గుండెపోటుకు గురైన భాగ్యరాజ్‌ను కుటుంబ సభ్యులు చెన్నై అపోలో హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించినట్లు నేషనల్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
1980-90 దశకాల్లో దర్శకుడిగా, రచయితగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్ సుమారు 75 చిత్రాల్లో హీరోగా నటించి, 25 సినిమాలకు దర్శకత్వం వహించి విశేష గుర్తింపు పొందారు. ఇటీవలే గోవాలో జరిగిన కుటుంబ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన ఆకస్మిక మరణం కోలీవుడ్, టాలీవుడ్ సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.