
PM Modi Seychelles Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం సీషెల్స్‌లో ఒక ముఖ్యమైన పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచర జంతువుగా పేరుగాంచిన ‘జోనాథన్’ అనే భారీ తాబేలు వద్దకు వెళ్లారు. అలాగే, సీషెల్స్ జాతీయ వృక్ష ఉద్యానవనంలో జరిగిన మొక్కల పెంపకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
భారత్, సీషెల్స్ మధ్య 50 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకల్లో భాగంగా ఈ పర్యటన జరిగింది. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి మోదీ ‘గౌరవ అతిథి’గా ఆహ్వానం లభించింది. ఈ పర్యటన సందర్భంగా మోదీ సీషెల్స్ అధ్యక్షుడు, ఇతర ఉన్నత నాయకులతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
జోనాథన్ సీషెల్స్‌లో నివసించే ఒక భారీ తాబేలు. ఇది 1832వ సంవత్సరంలో జన్మించిందని చెబుతారు. దీని ప్రకారం ప్రస్తుతం దాని వయస్సు సుమారు 194 సంవత్సరాలు. దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచర జంతువుగా గుర్తించారు.
తాబేళుకు ఆహారం తినిపించిన మోదీ
దాదాపు 194 ఏళ్ల వయస్సున్న ఆ తాబేలుకు ప్రధాని స్వయంగా ఆహారం తినిపించారు. జొనాథన్‌తో గడిపిన ఆ క్షణాలు పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిపై ప్రధానికి ఉన్న మమకారాన్ని చాటిచెప్పాయి. తన సెయిషెల్స్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ, జాతీయ వృక్షశాస్త్ర ఉద్యానవనాన్ని సందర్శించి అక్కడ మొక్కలు నాటనున్నారు. ఈ చొరవ పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి పట్ల భారతదేశ నిబద్ధతను చాటిచెబుతుంది.
భారత్-సీషెల్స్ మధ్య దౌత్య సంబంధాల స్వర్ణోత్సవానికి ముందు జరుగుతున్న ఈ పర్యటనను పలు విధాలుగా చారిత్రాత్మకమైనదిగా పరిగణిస్తున్నారు. ఒకవైపు ప్రధానమంత్రి మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంతువైన జోనాథన్‌ను కలువడం ఈ పర్యటన ప్రత్యేకంగా నిలుస్తోంది. దీనితో పాటు, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, పర్యావరణ సహకారానికి కొత్త ఊపు వస్తుందని ఆశిస్తున్నారు.
Visited the Giant Tortoise Enclosure at the Seychelles National Botanical Garden with President Dr. Patrick Herminie.
The Aldabra Giant Tortoise, which is native to Seychelles, is among the largest and longest-living species on Earth, with some of them witnessing over two… pic.twitter.com/995s3bfawf
— Narendra Modi (@narendramodi) June 27, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి