Reading Time: < 1 minute
IND vs IRE: షాకింగ్ న్యూస్.. ఐర్లాండ్-బీ టీమ్ చేతిలో ఓడిన టీమిండియా! మరీ ఇంత దౌర్భాగ్యమా?

టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత.. తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. పసికూన ఐర్లాండ్ చేతిలో శ్రేయస్ సేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. నిజానికి ఐర్లాండ్‌తో మ్యాచ్ అనగానే చాలా మంది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎలాగో మనోళ్లే గెలుస్తారు, పెద్దగా పోటీ ఉండదు, పైగా వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ కూడా ఆడటం లేదని చాలా మంది మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, ఐర్లాండ్ అద్భుతం చేసింది. తమ దేశానికి వచ్చిన ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించింది. ప్రపంచ క్రికెట్‌ దృష్టని తమవైపుకు తిప్పుకుంది ఐర్లాండ్.

ఐర్లాండ్‌పై ఓటమిని చాలా మంది భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే పసికూన జట్టుపై ఇంత ఘోరంగా ఓడిపోతారా? అంటూ సోషల్ మీడియా వేదికగా సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్, ఆటగాళ్లపై మండిపడుతున్నారు. పైగా వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా అభిమానులకు మరింత కోపం తెప్పించే మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. నిజానికి టీమిండియా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది అసలైన ఐర్లాండ్ టీమ్‌తో కాదు.. ఒకరకంగా చెప్పాలంటే ఐర్లాండ్ బీ టీమ్ చేతుల్లో టీమిండియా ఓటమిపాలైంది.

ఎందుకంటే.. ఐర్లాండ్ టీమ్‌‌లోని స్టార్ అండ్ కీ ప్లేయర్లు చాలా మంది గాయాలతో జట్టుకు దూరం అయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు స్టార్ ఆటగాళ్లు టీమిండియాతో సిరీస్ ఆడటం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఐర్లాండ్ తమ యంగ్ ప్లేయర్లను రంగంలోకి దింపింది. కానీ, వాళ్లే టీమిండియాకు షాకిచ్చారు. ఐర్లాండ్ టీమ్‌లో రెగ్యులర్‌గా ఆడే పాల్ స్టిర్లింగ్, జాస్ లిటిల్, మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, బారీ మెక్‌కార్తీ వంటి కీ ప్లేయర్లు లేకుండానే ఐర్లాండ్ జట్టు టీమిండియాతో సిరీస్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్లోనే పటిష్టమైన భారత జట్టును చావుదెబ్బ కొట్టింది. ఐర్లాండ్ జట్టుకు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌పై ఇదే తొలి విజయం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి