Reading Time: < 1 minute

బెంగాల్‌‌‌‌‌‌‌‌ స్ఫూర్తితోనే తెలంగాణలో గెలుస్తాం : ఎన్.రాంచందర్ రావు

Caption of Image.
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ధీమా 

హైదరాబాద్, వెలుగు: పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌ స్ఫూర్తితోనే తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఒక్క సీటు లేని బెంగాల్‌‌‌‌‌‌‌‌లో ఇప్పుడు అధికారంలోకి వచ్చామని, అదే ఉత్సాహం తెలంగాణ కార్యకర్తల్లో కనిపిస్తోందని చెప్పారు. ఈనెల10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో ప్రధాని మోదీ పాల్గొనే భారీ బహిరంగ సభా ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.

అనంతరం పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్​రావు మాట్లాడుతూ దేశంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. సుమారు రూ.8 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని రాష్ట్రానికి కానుకగా ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రం తెలంగాణకు రూ.13 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. మోదీ సభకు సుమారు 2 లక్షల మందిని సమీకరిస్తున్నామని తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.