Reading Time: < 1 minute

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం కక్కుతుంది : స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Caption of Image.

ధర్మసాగర్, వెలుగు :  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం కక్కుతోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  విమర్శించారు.శుక్రవారం ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.    రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూన్నాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు ఎంత అక్కసు ఉందో వారి మాటలు వింటే  అర్థం అవుతుందన్నారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  12ఏళ్లుగా తెలంగాణకు ఒక్క రూపాయి, ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తోట నాగరాజు, తహసీల్దార్​  సదానందం పాల్గొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.