Reading Time: < 1 minute

ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం వద్దు…సుజాత నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ

Caption of Image.

సుజాతనగర్, వెలుగు : రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సుజాతనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు, తేమ శాతం, తూకం విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ రైతులు రోజులు తరబడి వేచి ఉండకుండా వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. మొక్కజొన్న, ధాన్యం రవాణాకు లారీలు సరిపోవడం లేదని రైతులు ఫిర్యాదు చేయగా, వెంటనే అదనపు లారీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

పీఆర్-126 ధాన్యాన్ని రైస్ మిల్లర్లు స్వీకరించకపోవడంపై మిల్లర్లతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల నిల్వలు, ల్యాబ్ సేవలను పరిశీలించారు. ఆసుపత్రి పరిశుభ్రతతో పాటు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీవో భారతి, డాక్టర్ రమేష్, ఏఓ నర్మధ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.