Reading Time: < 1 minute

విద్యార్థులకు అలర్ట్: అడ్మిషన్ల సమయంలో ఆ డాక్యుమెంట్ తప్పనిసరి!

Caption of Image.

తెలంగాణ  గవర్నర్  శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా   విద్యా రంగానికి సంబంధించి పలు  అంశాలతో పాటు, జూన్ 12 న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో గవర్నర్  ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై ఈ సందర్భంగా  సీఎం చర్చించారు.

 ప్రధానంగా విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని గవర్నర్  సూచించారు. అందుకోసం విద్యార్థులతో ప్రమాణం చేయించేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని  సీఎం రేవంత్ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.