
సినీ వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసే పోస్టులు, మాట్లాడే మాటలు.. తరచుగా సోషల్ మీడియా వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్గా కేరళ సాహిత్యోత్సవం ఫెస్టివల్లో భాగంగా ఆయన రామాయణపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఆ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన తీరుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.. ‘‘ఇటీవల నేను ఒక సాహిత్య కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో కొన్ని మాటలను మాత్రమే తీసుకుని వక్రీకరించారు. నేను అవతారపురుషుడు రామ గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను దెబ్బతీశానని అంటున్నారు. కానీ అన్ని మతాలను, అందరినీ గౌరవించే నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కొందరు రాజకీయ నాయకులు నన్ను హిందూ వ్యతిరేకిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆయన తెలిపారు.
To all the desperate bigots #justasking pic.twitter.com/zGLpbEOcYp
— Prakash Raj (@prakashraaj) April 19, 2026
రామ, లక్ష్మణ ఉత్తరాది నుంచి దక్షిణానికి వచ్చినవారిగా పేర్కొన్నారు. అడవిలో పండ్లు తింటుండగా రావణుడు, శూర్పణఖ అక్కడికి వచ్చి వారిని గమనించేలా కథను వివరించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.