Reading Time: < 1 minute
Yash Toxic Movie Plot Goa Backdrop Cinemacon 2026 Updates

‘కేజీఎఫ్’ సిరీస్‌తో భారతీయ చిత్ర పరిశ్రమను తనవైపు తిప్పుకున్న రాకింగ్ స్టార్ యశ్, తదుపరి ఏ సినిమా చేయబోతున్నారనే ఉత్కంఠకు తెరదించుతూ ‘టాక్సిక్’ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా లాస్ వెగాస్‌లో జరిగిన సినిమాకాన్ 2026 వేదికగా యశ్ ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాకు ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనే వెరైటీ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న మర్మాన్ని యశ్ వివరించారు. ఇది కేవలం గ్యాంగ్‌స్టర్ డ్రామా మాత్రమే కాదని, భావోద్వేగాలతో కూడిన ఒక తండ్రీకొడుకుల ప్రతీకార గాథ అని ఆయన స్పష్టం చేశారు. “ఇది రామాయణానికి పూర్తి భిన్నమైన ప్రపంచం. చాలా క్రూరంగా, వైల్డ్‌గా సాగే కథ ఇది” అని యశ్ పేర్కొన్నారు.

Also Read :Google Gemini AI: నీట్ విద్యార్థులకు గూగుల్ ‘ఏఐ’ వరం.. “ఒకే క్లిక్‌తో జెమిని యాప్‌తో ఉచితంగా నీట్ ప్రాక్టీస్ టెస్టులు!”

సాధారణంగా గ్యాంగ్‌స్టర్ సినిమాలు ముంబై లేదా అండర్ వరల్డ్ చుట్టూ తిరుగుతుంటాయి. కానీ, యశ్ సినిమా కోసం ఈసారి గోవా చరిత్రలోని ఒక క్లిష్ట సమయాన్ని ఎంచుకున్నారు. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, గోవా మాత్రం 1961 వరకు పోర్చుగీస్ పాలనలోనే ఉంది. ఈ 14 ఏళ్ల పరిధిలో గోవాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, స్మగ్లింగ్ ముఠాల అరాచకాలు, అధికార పోరాటాల చుట్టూ ఈ ఫిక్షనల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను అల్లారు. సినిమా కథ 1940ల నుండి 1970ల వరకు అంటే దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగుతుంది. ఒక గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యం ఎలా పుట్టింది, ఎలా అంతమైంది అనే అంశాలను ఇందులో లోతుగా చూపించబోతున్నారు. ఈ సినిమాలో యశ్ ‘రాయ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనతో పాటు నయనతార, కియారా అద్వానీ, దిశా పటానీ, తారా సుతారియా, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్ వంటి హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సినిమాకాన్ వేదికగా ప్రదర్శించిన 9 నిమిషాల ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూ చూసిన అంతర్జాతీయ ప్రతినిధులు సైతం యశ్ నటనకు, సినిమా మేకింగ్ స్టైల్‌కు ఫిదా అయ్యారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.