Reading Time: < 1 minute
Strait Of Hormuz Reopened Iran Announces Temporary Shipping Corridor Amid Ceasefire

Strait Of Hormuz: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. ఇజ్రాయిల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో, చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తిరిగి తెరస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ కాలం ఉన్నంత కాలం జలసంధిని ఓపెన్ చేసి ఉంచుతున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ ఎక్స్‌లో ప్రకటించారు. ఈ జలమార్గం ద్వారా అన్ని వాణిజ్య నౌకలు రాకపోకలు కొనసాగించొచ్చని అన్నారు.

Read Also: Kangana Ranaut: ‘రాహుల్ గాంధీ మాట వింటే తలనొప్పి వస్తోంది’.. షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్

‘‘లెబనాన్‌లో అమలవుతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా, ఆ విరమణ కాలం మిగిలి ఉన్నంత వరకు హార్ముజ్ జలసంధి గుండా అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు మార్గం పూర్తిగా తెరిచి ఉంటుంది’’ అని అరఘ్చీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని 20 శాతం చమురు సరఫరా ఈ ఇరుకైన జలమార్గం గుండానే సాగుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఏర్పడింది. భారత్ సహా యూరప్, చైనా ఇతర దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. 49 రోజుల తర్వాత ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచింది.